మసాలా పెరిగిన బిగ్ బాస్-2

బిగ్‌బాస్‌-2 రియాల్టీ షోకు రోజు రోజుకు ప్రేక్షకాదరణ పెరుగుతోంది. తొలి రెండు వారాల్లో కాస్త చప్పగా అనిపించినా రాను రాను మసాలా ఎక్కువ కనిపిస్తోంది. ఈ మధ్య బిగ్‌బాస్ హౌస్‌లో చోటుచేసుకున్న పరిణామాలతో ప్రేక్షకులు ఆకర్షితులవుతున్నారు. హౌస్‌మెట్స్‌ మధ్య గొడవలు.. ప్రేమలు.. ఫన్నీ టాస్క్‌లతో షోలో కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ పెరిగింది. గత వారం హౌస్ సభ్యులకు బిగ్‌బాస్ ఇచ్చిన షుగర్ కేన్ జ్యూస్ టాస్క్ బాగా అలరించింది. అందరూ పోటా పోటీగా బాగా చేశారనిపించింది. దీనికి తోడు వీకెండ్‌లో తనదైన శైలితో హోస్ట్ నాని అలరిస్తున్నాడు. హౌస్‌మెట్స్‌ మధ్య చోటుచేసుకున్న గొడవలపై కాస్త సిరీయస్‌గానే ఆరా తీస్తున్నాడు. అంతేకాకుండా వస్తూ వస్తూనే ఓపిట్ట కథ చెప్పి చివర్లో అది ఏ కంటెస్టెంట్‌కు వర్తిస్తుందో.. అని తనదైన స్టయిల్లో పరోక్షంగా చెబుతున్నాడు.

శనివారం జరిగిన ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్ అందరి పేర్లు ఒక్కో కవర్లో ఒక్కొక్కరి పేరు చొప్పున రాసి పెట్టారు. దాని ఒక్కో సభ్యుడు ఒక్కో కవరు తీసుకోవడం దానిలో ఏ సబ్యుడి పేరు ఉందో ఆ సభ్యుడి పేరు చెప్పకుండా అతని గుణ గణాలను వర్ణిస్తూ డప్పుకొట్టి చెప్పాలి. అది మిగతా సభ్యులు గెస్ చేయగలగాలి. కొందరు సోది చెబుతున్నట్టుగా, మరికొందరు పాట పాడుతున్నట్టుగా డప్పు కొడుతూ తనదైన స్టైల్లో సభ్యుల గురించి వివరిస్తూ ఆకట్టుకున్నారు.

తొలి రెండు వారాల్లో సామాన్యులే ఎలిమినేట్‌ అయ్యారు. ఈ విషయంలో ప్రేక్షకులు కొంత అసహనం కూడా వ్యక్తం చేశారు. ఇది బిగ్‌బాస్‌ స్క్రిప్ట్‌ ప్రకారమే జరుగుతోందని సోషల్ మీడియాలో కామెంట్లు కూడా చేశారు. అయితే ఈ సారి మాత్రం సెలబ్రిటీ కిరీటి దామరాజు హౌస్‌ను వీడనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం నానీ సైతం గతవారమే చెప్పాడు.. దీనికి కారణం కౌశల్‌ పట్ల కిరీటి వ్యవహరించిన తీరే. అందుకే సభ్యులంతా కిరీటిని ఈ వారం నామినేట్‌ చేశారు. తన ప్రవర్తనతో హౌస్ లో తాను ఒంటరైపోయాడు. అయితే శనివారం జరిగిన ఎపిసోడ్‌లో ఈవారం నామినేషన్ అయిన వారినుంచి తేజశ్వి సేఫ్టీ జోన్‌లోకి వెళ్లిపోయింది. ఆదివారం జరిగే ఎపిసోడ్‌లో కిరీటి, గణేష్, గీతామాధురి ఎవరు ఎలిమినేట్ అవుతారో ప్రకటిస్తారు.