‘మహానటి’కి చిరు సెంటిమెంట్!

మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘మహానటి’ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా ప్రియాంకా దత్ నిర్మిస్తున్న ఈ సినిమాను మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించారు. యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘మహానటి’ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకు చేరుకుంది.
1990 మే 9న‌… వైజ‌యంతీ మూవీస్ సంస్థ నుంచి వ‌చ్చిన `జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి` టాలీవుడ్ రికార్డుల్ని తిర‌గ‌రాస్తూ కొత్త చ‌రిత్ర సృష్టించింది.

స‌రిగ్గాఅదే రోజున `మ‌హాన‌టి` విడుద‌ల అవుతుండ‌డం విశేషం. టాలీవుడ్‌లోని ప్ర‌ముఖ న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఇది వ‌ర‌కు చూడ‌ని వినోదాన్ని పంచివ్వ‌బోతోంది. మ‌హాన‌టి సావిత్రి క‌థ‌ని వెండి తెర‌పై ద‌ర్శ‌కుడు ఆవిష్క‌రించిన తీరు.. తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో చిరస్థాయిగా చిలిచిపోయేలా ఉంటుంద‌ని చిత్ర‌బృందం తెలిపింది.