‘మహానటి’లో ప్రకాష్ రాజ్ లుక్!

మహానటి సావిత్రి జీవితచరిత్రను ‘మహానటి’ పేరుతో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నది.. సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రను దుల్కర్ సల్మాన్ పోషిస్తున్నాడు. మరో రెండు కీలకమైన పాత్రల కోసం సమంత, ప్రకాశ్ రాజ్, షాలినీ పాండేలను తీసుకున్నారు.. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నట్లు తెలిపింది. తెలుగు సినీపరిశ్రమలోని ప్రముఖ నిర్మాతల్లో ఒకరు, విజయ వాహిని బేనర్ అధినేత చక్రపాణి పాత్రలో ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో కనిపించనున్నాడు. తొలినాళ్లలో సావిత్రిలోని టాలెంట్ గుర్తించి, తన సినిమాల్లో నటిగా అవకాశం ఇచ్చిన నిర్మాతల్లో చక్రపాణి ఒకరు.
సావిత్రి సినీ జీవితంలోని అతిముఖ్యమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆ పాత్ర సినిమాలో కీలకంగా ఉండనున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్‌ను ఆ పాత్రకు ఎంపిక చేశారు. తాజాగా మహనటి షూటింగ్ లో పాల్గొన్న ప్రకాష్ రాజ్ స్టిల్ ను చిత్ర యూనిట్ విడుదలల చేసింది.. ఈ స్టిల్ ల్లో వాహిని స్టూడియోస్ గేటు బయల కుర్చిలో కూర్చుని పుస్తకం చదువుతున్నాడు ప్రకాష్ రాజ్.. మీరూ ఈ స్టిల్ పై లుక్కేయండి.