మహానటిలో మలయాళ నటుడు!

సావిత్రి జీవిత చరిత్రను సినిమాగా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాస్టింగ్ కోసం దర్శకుడు నాగశ్విన్ చాలా రోజులుగా అన్వేషిస్తున్నాడు. ఈ క్రమంలో కీర్తి సురేష్, సమంతల పేర్లను ఖరారు చేశారు. తాజాగా అనుష్క పేరు కూడా ఈ లిస్ట్ లో వినిపిస్తోంది. జమున పాత్రలో అనుష్క కనిపించబోతోందని టాక్. అయితే సావిత్రి భర్త జెమినీ గణేషన్ ది కథలో కీలకపాత్ర.

ఈ పాత్ర కోసం మొదట సూర్య, తరువాత ప్రకాష్ రాజ్ ల పేర్లు వినిపించాయి. కానీ తాజాగా ఈ పాత్ర కోసం మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సమంత, కీర్తి సురేష్, అనుష్క ల ద్వారా తెలుగు, తమిళ ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు దుల్కర్ ను తీసుకోవడం ద్వారా మలయాళ ప్రేక్షకుల దృష్టిని కూడా సినిమాపైకి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.