మహేష్‌బాబు 25వ సినిమా

మహేష్‌బాబు 25వ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్, దిల్‌రాజు కలిసి నిర్మించబోతున్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. అల్లరి నరేష్ ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్న ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ శాతం డెహ్రడూన్‌లో ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.

ఈ సినిమా కోసం త్వరలో మహేష్ అండ్ బృందం కొన్ని రోజులపాటు డెహ్రడూన్‌లో ఉండబోతున్నారు. అక్కడి అందాలను చాయాగ్రహకుడు కేయూ మోహనన్‌ అద్భుతంగా క్యాప్చర్ చేయబోతున్నారట. డెహ్రడూన్‌ షూటింగ్ పూర్తిచేసుకున్న తర్వాత హైదరాబాద్‌లో నెక్ట్స్ షెడ్యూల్‌ ప్లాన్ చేయనున్నారట.

మరోవైపు ఇండస్ట్రీలో 25వ సినిమా అంటే ఓ సెంటిమెంట్‌ అభిమానులను భయపెడుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ 25వ సినిమా అజ్ఞాతవాసి పరాజయం పాలైంది. ఎన్టీఆర్ 25వ సినిమా నాన్నకు ప్రేమతో పర్వాలేదనిపించినా అనుకున్నంత మైలేజీ రాలేదు. దీంతో మహేష్‌బాబు 25వ సినిమా గురించి అభిమానుల్లో టెన్షన్ పట్టుకుందని, ఈ విషయంలో మహేష్ కూడా భయపడుతున్నాడని సమాచారం.