మహేష్‌ న్యూ లుక్‌

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబుకి ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ అవినాష్‌ గోవారికర్‌ పనితీరు తనకు ఇష్టమని అన్నారు. తాజాగా మహేశ్‌ ఆయనతో కలిసి ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన చక్కటి ఫొటోను అవినాష్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘సూపర్‌ ఛార్మింగ్,‌ సూపర్‌ ఫాస్ట్‌ సూపర్ స్టార్‌.. మహేశ్‌బాబుతో పోస్ట్‌ ప్యాకప్‌
షూట్‌’ అని రాశారు.

దీనికి మహేశ్‌ స్పందించారు. ‘మీ వర్కింగ్‌ స్టైల్‌ చాలా ఇష్టం. మీతో షూటింగ్‌‌ ఎప్పుడూ ఫన్‌గానే ఉంటుంది. ప్రత్యేకమైన మహారాష్ట్ర భోజనాన్ని ఎంజాయ్‌ చేశా’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను ఆయన పంచుకున్నారు. ‘నేను దీన్ని మిస్‌ అయ్యాను’ అంటూ నమ్రత తన ప్రియమై‌న భర్త ఫొటోను షేర్‌ చేశారు.