మహేష్ కు ఎక్స్ ప్రెస్ చేయడం రాదు: మంజుల!

నటశేఖర కృష్ణ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తండ్రి పేరు నిలబెడుతూ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. మరోపక్క కృష్ణ కూతురు మంజుల కూడా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది. గతంలో నటిగా కొన్ని సినిమాల్లో నటించిన మంజుల ఇప్పుడు దర్శకురాలిగా మారి ‘మనసుకు నచ్చింది’ అనే సినిమాను రూపొందించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిజల్ట్ విషయంలో ఆమె చాలా నమ్మకంగా ఉంది.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజుల తన తమ్ముడు మహేష్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. ‘సినిమాల్లో మాదిరి మహేష్ నిజ జీవితంలో కూడా అంత ఓపెన్ గా ఎక్స్ ప్రెసివ్ గా ఉండడు. తనకు ప్రేమను గుండెల్లో దాచుకోవడమే తప్ప వ్యక్తపరచడం రాదు. పుట్టినరోజు కూడా ఫోన్ చేసి ప్లాన్స్ ఏంటని అడిగి విష్ చేయడం మర్చిపోతాడు’ అంటూ చెప్పుకొచ్చింది.