మహేష్ దర్శకుడికి కొత్త సమస్య!

ఈ మధ్య కాలంలో మహేష్ బాబుకి సరైన హిట్టు సినిమా దక్కలేదు. దీంతో ‘భరత్ అనే నేను’ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని కష్టపడుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో మహేష్ రాజకీయనాయకుడిగా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా తరువాత మహేష్ దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. దిల్ రాజు-అశ్వనీదత్ కలిసి నిర్మించనున్న ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ తరుణంలో నిర్మాత పీవీపీ ఈ సినిమాను నిర్మించే హక్కులు తనకు మాత్రమే ఉన్నాయంటూ కోర్టుని ఆశ్రయించారు. దీంతో స్క్రిప్ట్ కాస్త కోర్టు ఆధీనంలోకి వెళ్ళింది. డైరెక్టర్ తో పాటు ఈ సినిమాకు పని చేయాలనుకున్న కొందరు టెక్నీషియన్స్ కు కూడా కోర్టు నోటీసులు అందాయి. కోర్టు తొందరగా ఏదొక విషయాన్ని తేలిస్తే పర్వాలేదు లేదంటే మహేష్ తదుపరి సినిమా మరో డైరెక్టర్ తో మొదలుపెట్టడం ఖాయమంటున్నారు.