మహేష్ పొలిటికల్ పంచ్ లు!

వరస పరాజయాలతో సతమతమైపోతున్న మహేష్ తను నటిస్తోన్న ‘భరత్ అనే నేను’ సినిమాపై ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈసినిమా విజయం బట్టి మహేష్ నటించే తదుపరి సినిమాల మార్కెట్ ఆధారపడి ఉంటుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొదటిసారిగా ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్న ఈమూవీలో మహేష్ ఒకనాటి సమైఖ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈసినిమాలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉండగా ఈనెల 6వ తారీఖున విడుదల కాబోతున్న ఈమూవీ టీజర్ కు సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు బయటకు వచ్చింది.

ఈమూవీ పై  ఆసక్తి మరింత పెంచేలా అదిరిపోయే పొలిటికల్ సెటైర్ డైలాగులు ఉన్న టీజర్ ను కొరటాల శివ డిజైన్ చేసాడట. రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అంటూ మహేష్ ఈ టీజర్ లో సెటైర్ పేలుస్తాడట. ఈ డైలాగ్ అన్ని పార్టీలకు తగులుతుందని టాక్. మరి ఈ కారణంగా సినిమా ఎలాంటి వివాదాల్లో ఇరుక్కుంటుందో చూడాలి!