మార్ఫింగ్‌ ఫొటోపై సమంత స్పందన

అక్కినేని కోడలు, ప్రముఖ నటి సమంత తరచు సోషల్‌ మీడియాలో చురుకుగా ఉంటుంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ అభిమాని సమంత ఫొటోను మార్ఫింగ్‌ చేసి ట్విట్టరోలో షేర్‌ చేశాడు. ఆ ఫొటో సమంత కంట పడింది. ఆమె పెళ్లి సందర్భంగా దిగిన ఫొటోలో ఆమె పక్కన నాగచైతన్యకు బదులుగా మరో వ్యక్తి పూలదండను ధరించి నిల్చుని ఉన్నారు. అభిమాని ఈ ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘సమంత ఏంటిది?’ అని ప్రశ్నించారు.

దీనికి సమంత చాలా సరదాగా సమాధానం చెప్పారు. ‘గత వారం పారిపోయి, వివాహం చేసుకున్నాం. ఇది ఎలా లీక్‌ అయ్యిందో తెలియదు. మాది తొలి చూపుతోనే కలిగిన ప్రేమ’ అని సమంత ట్వీట్‌ చేశారు. ఇలా స్పందించడం పట్ల సమంతను అభిమానులు అభినందనలతో ముంచేత్తుతున్నారు. కాగా సోషల్‌ మీడియాలో కుదిరినప్పుడల్లా సామ్‌ తన అభిమానుల ట్వీట్లకు స్పందిస్తుంటారు.