మార్షల్‌ ఆర్ట్స్‌ టీచర్‌గా సమంత

సమంత అక్కినేని, శివకార్తికేయన్‌ జంటగా పొనరామ్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘సీమరాజా’. ఈ సినిమా సమంత కర్రసాము నేర్పించే టీచర్‌ సుదందిరదేవి పాత్రలో నటించారు ఈ పాత్ర కోసం సమంత కష్టపడి కర్రసాము నేర్చుకున్నారు. 15 సార్లు మార్షల్‌ ఆర్ట్స్‌ క్లాసులకు వెళ్లారట. అంటే ముందు స్టూడెంట్‌గా కర్రసాము క్లాసులకు వెళ్లిన సమంత, వెండితెరపై టీచర్‌గా మారారు.

కాగా ఈ చిత్రంలో సీనియర్‌ నటి సిమ్రాన్‌ విలన్‌ పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు డి. ఇమ్మాన్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 13న విడుదల కానుంది. అంతేగాక సమంత ప్రధాన పాత్రధారిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన యు టర్న్‌ చిత్రం కూడా సెప్టెంబర్‌ 13 నే విడుదల కావడం విశేషం.