మాస్ మహారాజ ఒకేసారి రెండు సినిమాల్లో!

మాస్ మహారాజ ఒకేసారి రెండు సినిమాల్లో!
గత సంవత్సరం ‘బెంగాల్ టైగర్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన రవితేజ ఈ సంవత్సరం ఒక్క సినిమాను 
కూడా విడుదల చేయలేదు. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఓ సినిమా మొదలు పెట్టినా.. అది కూడా మధ్యలోనే 
ఆగిపోయింది. దీంతో చాలా గ్యాప్ తీసుకున్నాడు. మొన్నామద్య బాబీ చెప్పిన కథ నచ్చడంతో 
సినిమా చేస్తాడనే మాటలు వినిపించాయి. అయితే ఈ సినిమాతో పాటు ఆయన మరో సినిమా కూడా
కమిట్ అయినట్లు తెలుస్తోంది. విక్రమ్,దీపక్ అనే ఇద్దరు దర్శకులు చెప్పిన కథకు రవితేజ గ్రీన్ సిగ్నల్ 
ఇచ్చాడట. వారిద్దరు కలిసి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. అలానే బాబీ సినిమా కూడా ఓకే చెప్పాడు. ఈ రెండు సినిమాలను ఒకేసారి పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు మన మాస్ మహారాజ. రెండు 
నెలల గ్యాప్ లో ఒకదాని తరువాత మరొకటి విడుదల చేయాలనుకుంటున్నాడు. మరి ఈ రెండు 
సినిమాలతో తన ఆబ్సెన్స్ ను మర్చిపోయేలా చేస్తాడేమో చూడాలి!
CLICK HERE!! For the aha Latest Updates