మీ అమ్మను వెంట తీసుకురాకు అనే వారు: ఆమని

సీనియర్‌ నటి ఆమని కాస్టింగ్‌ కౌచ్‌పై స్పందించారు. ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌పై పెద్ద ఎత్తున వివాదలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో పలువురు నటీమణులు ఈ విషయంపై స్పందిస్తున్నారు. గతంలో మీటు అంటూ సోషల్‌ మీడియాలో ఓ క్యాంపెయిన్‌ కూడా నడిచింది. అయితే ఇటీవల టాలీవుడ్‌ను ఇదే అంశం కుదిపేస్తోంది. ఇటీవల క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన ఆమని ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాల గురించి వివరించారు.

కాస్టింగ్ కౌచ్‌ అన్నది కొత్త విషయం కాదని గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఉన్నాయని తెలిపారు. స్వయంగా తాను కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురుకున్నాను అన్నారు. సినిమా గురించి మాట్లాడేందుకు సంప్రదించిన కొందరు అంతా ఓకె అనుకున్న తరువాత గెస్ట్‌హౌస్‌కు రమ్మనే వారని తెలిపారు.

అంతేకాదు ప్రత్యేకంగా మీ అమ్మను వెంట తీసుకురాకు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. వాళ్ల మాటలను బట్టే అంతా అర్ధమయ్యేదని అందుకే అలాంటి వారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిచేదాని అని తెలిపారు. పెద్ద నిర్మాణ సంస్థల్లో ఇంలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు అన్న ఆమని, చిన్నకంపెనీల నుంచి ఎక్కువగా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కునని పేర్కొన్నారు.