మురుగదాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి

కాస్టింగ్‌ కౌచ్‌ పేరుతో పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేసిని శ్రీరెడ్డి తాజాగా ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌పై సంచలన ఆరోపణలు చేసింది. హాయ్‌ తమిళ డైరెక్టర్‌ మురుగదాస్‌ జీ ఎలా ఉన్నారు? గ్రీన్‌ పార్క్‌ హోటల్‌ గుర్తుందా? అంటు బాంబు పేల్చింది.

రచయిత వెలిగొండ శ్రీనివాస్‌ ద్వారా మనం కలిశామని. తనకు సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పారని మురుగదాస్‌కు గుర్తుచేశారు. ఆ రోజు హోటల్‌లో మనం చాలా…అయినా ఇప్పటి వరకూ మీరు ఎలాంటి ఆఫర్‌ ఇవ్వలేదు..మీరు చాలా గొప్ప వ్యక్తి సార్‌ అంటూ ముగించారు.మరి తనపై చేసిన సంచలన ఆరోపణలకు మురుగదాస్‌ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. పవన్‌ కళ్యాణ్‌, నాని సహా పలువురు టాలీవుడ్‌ ప్రముఖులపై శ్రీరెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఓ వైపు ఇండస్ర్టీలో సమస్యలు, అక్కడి మనుషుల వ్యక్తిత్వాలు, అసలు రూపాలు గురించి బయట పెడుతూ సంచలన ఆరోపణలు చేస్తూనే.. తన అందచందాలతో అభిమానులను ఆకట్టుకుంటుంది శ్రీరెడ్డి.