మెగాహీరోల రూ.50 కోట్ల టార్గెట్!

ఈ వారంలో ఒక్కరోజు గ్యాప్ తో ఇద్దరు మెగాహీరోలు నటించిన సినిమాను విడుదల కాబోతున్నాయి. సాయి ధరం తేజ్ నటించిన ‘ఇంటెలిజెంట్’ సినిమా ఒకటి కాగా, వరుణ్ తేజ్ నటించిన ‘తొలిప్రేమ’ మరొకటి. ఈ రెండు సినిమాలు కనీసం రూ.50 కోట్లు షేర్ వసూలు చేస్తేనే నిర్మాతలకు లాభాలు వస్తాయి. ఈ రెండు సినిమాలకు పోటీగా మోహన్ బాబు ‘గాయత్రి’ సినిమా విడుదల కాబోతుంది. వరుణ్ తేజ్ సినిమాకు మొత్తం కలిపి రూ.16 కోట్లు ఖర్చయింది. రూ.18 కోట్లు బిజినెస్ చేసారు. విడుదలకు మరో రెండు కోట్లు ఖర్చైవుంటుంది. ఈ మొత్తాన్ని వరుణ్ సినిమా రాబట్టాలి.

ఆయన నటించిన ‘ఫిదా’ సినిమా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కావడం, అలానే ఈ సినిమాకు పాజిటివ్ బజ్ ఉండటంతో సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్మకంతో ఉన్నారు. ఇక ధరం తేజ్ ‘ఇంటెలిజెంట్’ సినిమాకు రూ.27 కోట్ల బిజినెస్ జరిగింది. అదే రేంజ్ లో సినిమా వసూళ్లను కూడా కొల్లగొట్టాలి. అయితే ఈ మధ్య కాలంలో రొటీన్ సినిమాలను జనం పక్కన పెట్టేస్తున్నారు. మరి ఇంటెలిజెంట్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి!