మెగాహీరో డ్యూయల్ రోల్!

మెగాహీరో వరుణ్ తేజ్ ‘ఫిదా’,’తొలిప్రేమ’ వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నాడు. ఇదే జోరుతో ‘ఘాజీ’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయిన దర్శకుడు సంకల్ప్ రెడ్డితో మరో సినిమా చేయడానికి అంగీకరించాడు. స్పేస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగనుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం వరుణ్ ఈ సినిమా కోసం జీరో గ్రావిటీ శిక్షణ పొందుతున్నాడు. తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ హీరో. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సాగర్ చంద్రతో సినిమాచేయనున్నాడు వరుణ్.ఈ సినిమాలో వరుణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని సమాచారం. పీరియాడిక్ ఫార్ములాతో తెరకెక్కనున్న ఈ సినిమా రెండు కాలాలకు సంబంధించిన సన్నివేశాలతో నడుస్తుందని తెలుస్తోంది. స్వాతంత్య్రం రాకముందు, అలానే ప్రస్తుతానికి మధ్య కథ సాగుతుందట. కథ ప్రకారం హీరో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని చెబుతున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు.