మైకేల్ జాక్సన్ తండ్రి కన్నుమూత

వరల్డ్ ఫేమస్ పాప్‌ సింగర్‌ మైకేల్‌ జాక్సన్‌ తండ్రి జోయ్ జాక్సన్‌(89) కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా పాట్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. లాస్ వేగాస్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని రేమోనే బైన్‌, జోయ్‌ మనవడు రాండీ జాక్సన్‌లు ధ్రువీకరించారు. రేమేనే బైన్ గతంలో దిగవంత మైకేల్ జాక్సన్ కు అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. ఈ బాధాకరమైన వార్తను జోయ్ మరో మనవడు తేజ్ జాక్సన్ కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ మా కుటుంబం చాలా బాధల్లో ఉంది. మమ్మల్ని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించకండి అని విజ్ఞప్తి చేశాడు. మైకేల్ జాక్సన్ 2009లో మరణించిన సంగతి తెలిసిందే.

1960 కాలంలో జోయ్ తన పిల్లల్లోని అద్భుతమైన సంగీత ప్రతిభను గుర్తించి జాక్సన్-5 పేరుతో మ్యూజిక్ ట్రూప్ ను నెలకొల్పాడు. ఈ ట్రూప్ లో మైకేల్ చేరినప్పుడు 8 ఏళ్ల పిల్లాడు. తర్వాత కాలంలో మైకేల్‌ జాక్సన్‌, జోయ్‌ కూతురు జానెట్‌ జాక్సన్‌లు గొప్ప పాప్‌ సింగర్స్ గా గుర్తింపు తెచ్చుకుని ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. జోయ్ జాక్సన్‌‌ 11 మంది పిల్లలో 9 మంది గొప్ప పాప్‌ సింగర్లుగా చాలా పాపులర్‌ ఆల్బమ్స్‌ చేశారు.