‘ మై డియర్ మార్తాండం’ టీజర్‌ను విడుదల చేసిన వైఎస్‌ జగన్‌

కమెడియన్‌ పృథ్వీ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మై డియర్‌ మార్తాండం’. ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమాలో హీరోగా నటించిన పృథ్వీ మరోసారి హీరోగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం కోర్టు డ్రామ నేపథ్యంగా రూపొందుతుంది. ఇందులో పృథ్వీ 30 రోజుల్లో లాయర్‌ అవుతానంటూ చేసిన కామెడీ చూస్తుంటే సినిమాలో ఎంటర్టైన్మెంట్ మోతాదు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ చిత్రంలో జయప్రకాశ్‌ రెడ్డి, కృష్ణ భగవాన్‌, తాగుబోతు రమేష్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాలో రాకెందుమౌళి, కల్పిక హీరో హీరోయిన్లుగా నటించగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ కళ్యాణ్ విఠపు ఒక ముఖ్య పాత్రలో నటించారు. హరీష్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌నుకొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. కాగా ఈ చిత్రాన్ని సయ్యద్‌ నిజాముద్దీన్‌ నిర్మాస్తున్నారు.