‘మై డియర్ మార్తాండం’ టీజర్‌ను రిలీజ్‌ చేయనున్న వైస్ జగన్

30 ఇయర్స్ ఇండస్ర్టీ అనే డైలాగ్‌తో మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్ పృథ్వీరాజ్ హీరోగా మారాడు. వరుసగా మంచి సినిమాల్లో ప్రేక్షకులు మెచ్చే పాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ కమెడియన్ హీరోగా చేస్తున్న మరో చిత్రం ‘మై డియర్ మార్తాండం’. నూతన దర్శకుడు కేవీ హరీష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 30 రోజుల్లో లాయర్ అయ్యి.. కోర్టులో కేసులను గెలిపించడం ఎలా? అనే ఆసక్తికర కథతో రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా లాయర్ గెటప్ లో పృథ్వీ అలరించాడు.

త్వరలోనే ఈ సినిమా టీజర్‌ను ఏపీ ప్రతిపక్ష నేత వైస్ జగన్ చేతుల మీదుగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మధ్యనే పృథ్వీ రాజ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తన మద్దతు తెలిపి జగన్ తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. అలాగే ప్రస్తుతం జగన్ చేస్తున్న పాదయాత్రలో కూడా పృథ్వీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తాను హీరోగా చేసిన సినిమా టీజర్ ను జగన్ చేత రిలీజ్ చేయించాలని ప్లాన్ చేశాడట పృథ్వీ. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశముంది. మజిన్ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగష్టు లో ప్రేక్షకుల ముందుకు రానుంది.