మోహన్‌లాల్ రాజకీయాల్లోకి వస్తున్నారా?

మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని, ఆయన 2019 ఎన్నికల్లో బీజేపీ తరపున తిరువనంతపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని రెండు మూడు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా వీటిపై స్పందించిన ఆయన తన సినిమాలు తాను చేసుకుంటున్నానని, రాజకీయ అరంగేట్రంపై తనకు ఎలాంటి ఐడియా లేదని రూమర్లను ఖండించారు. సోమవారం మోడీని కలిసిన ఆయన తన విశ్వశాంతి ఫౌండేషన్ గురించి ఆయనకు వివరించానని, అలాగే భవిష్యత్తులో కేరళ అభివృద్ధి కోసం జరగబోయే గ్లోబల్ మళయాల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాలని అడిగానని అప్పుడే ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.