మ్యూజిక్‌ వీడియోలో ‘విజయ్‌ దేవరకొండ’

టాక్సీవాలా, గీత గోవిందం, నోటా, కామ్రేడ్ సినిమాలు చేస్తున్న సినిమాలతో ఫుల్‌ ఫాంలో ఉన్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ. త్వరలో ఓ మ్యూజిక్‌ వీడియోలో సందడి చేయనున్నారు. విజయ్‌ ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ మ్యూజిక్‌ వీడియోలో నటించేందుకు అంగీకరించాడు. భానుశ్రీ తేజ దర్శకత్వంలో రూపొందుతోంది. భానుశ్రీ కి ఇంతకు ముందు ఇలాంటి రెండు మూడు వీడియో సాంగ్స్ చేసిన అనుభవం ఉంది. ఈ వీడియోకు సౌరభ్, దుర్గేష్‌లు సంగీతమందిస్తున్నారు.

ఈ మ్యూజిక్‌ వీడియోను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. ఈ వీడియోలో విజయ్ సరసన బెంగాళీ మోడల్‌ మాళవిక బెనర్జీ ఆడిపాడనుంది. తెలుగులో ఇలా వీడియో సాంగ్ లో నటించబోతున్న మొదటి హీరో విజయ్ దేవరకొండ. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వీడియో ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే రిలీజ్ తేదిని వెల్లడించానున్నారు.