యంగ్‌ రెబల్‌ స్టార్‌ చిత్రం కోసం పూజా హెగ్డే ఫొటోషూట్‌

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరగుతోంది. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెట్స్‌మీద ఉండగానే మరో సినిమాను మొదలు పెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు ప్రభాస్‌. జిల్‌ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటించేందుకు ఇప్పటికే ఓకె చెప్పాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే పూజ బాగా సన్నబడటంతో ప్రభాస్‌కు జంటగా ఎలా ఉంటుందో అన్న అనుమానంతో ఫొటోషూట్‌ చేశారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ షూట్‌కు సంబంధించి మూవీ యూనిట్‌ నుండి ఎటువంటి అధికార ప్రకటనా రాలేదు. యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడిక్‌ జానర్‌లో తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్‌ జ్యోతిష్యుడిగా కనిపించనున్నాడన్న వార్తలు కూడా వినిపిస్తోంది.