‘యాత్ర’లో జగన్‌ పాత్రకు ఇతడే..!

వైఎస్సార్‌ బయోపిక్ ‘యాత్ర’ పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వైఎస్సార్‌ పాత్రలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. మహి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ చిత్రంలో వైఎస్ తనయుడు జగన్‌ పాత్ర చాలా కీలకం. తనయుడిగానే కాకుండా, రాజకీయ నాయకుడిగా కూడా జగన్‌ తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు. ఈ పాత్రకు ఉన్న ప్రాధాన్యతను బట్టి టాలీవుడ్‌, కోలీవుడ్‌లోని టాప్‌ నటుల్లో ఒకరిని ఎంపిక చేయాలని మహి అండ్‌ బృందం అనుకున్నది. అనేక పేర్లను పరిశీలించిన తరువాత కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్యను కలిశారు.

 

జగన్ పాత్ర సూర్యకు నచ్చినప్పటికీ.. బిజీ షెడ్యూల్‌ కారణంగా ఆ పాత్రను తమ్ముడు కార్తీకి ఆఫర్‌ చేశాడట. యాత్ర మూవీలో జగన్‌ రోల్‌ చిన్నదే అయినా చాలా ముఖ్యమైన పాత్ర కావడం.. పైగా అన్న రికమండ్‌ చేయడంతో కార్తీ వెంటనే ఓకే చెప్పాడట. ప్రస్తుతం కార్తీ.. కడైకుట్టి సింగం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ప్రమోషన్స్‌ పూర్తికాగానే యాత్ర మూవీ షూటింగ్‌లో పాల్గొంటాడు. ఈ చిత్రంలో మరో ముఖ్యమైన పాత్ర వైఎస్సార్‌ కూతురు షర్మిల.. ఈ పాత్రలో ఎవరు చేస్తారనేది ఇంకా సస్పెన్స్‌ గానే ఉంది.

CLICK HERE!! For the aha Latest Updates