‘యాత్ర’ మూవీ టీజర్‌

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి బయోపిక్‌ ‘యాత్ర’ టీజర్‌ను విడుదల చేశారు. మళయాళ ప్రముఖ నటుడు మమ్ముటీ వైఎస్‌ఆర్‌ ప్రాత పోషిస్తున్న ఈ చిత్రం ఆనందోబ్రహ్మ ఫేమ్‌ మహి వీ రాఘవ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రజానేత జీవితంలోని మహాప్రస్థానం(పాదయాత్ర) అనే కీలక ఘట్టం ఆధారంగా యాత్రను మహి రూపొందిస్తున్నారు. ఈ రోజు వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు

ఈ టీజర్‌ ‘తెలుసుకోవాలని ఉంది. వినాలని ఉంది. ఈ కడప దాటి ప్రతీ గడపలోకి వెళ్లాలని ఉంది. వారితో కలిసి నడవాలని ఉంది. వాళ్ల గుండెచప్పుడు వినాలని ఉంది. గెలిస్తే పట్టుదల అంటారు. ఓడిపోతే మూర్ఖత్వం అంటారు. ఈ పాదయాత్ర నా మూర్ఖత్వమో పట్టుదలో చరిత్రే నిర్ణయించబోతోంది.’ అని మమ్ముట్టి చెప్తున్న డైలాగులు హైలైట్‌గా నిలిచాయి. అంటూ బ్యాక్‌ గ్రౌండ్‌లో డైలాగులు వినిపించాయి. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం వేగంగా సాగుతోంది.

ఈ చిత్రంలో వైఎస్‌ సన్నిహితుడు సూరీడు పాత్రలో పోసాని కృష్ణమురళి, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పాత్రలో సుహాసిని, వైఎస్‌ కుమార్తె షర్మిళ పాత్రలో భూమిక, వైఎస్‌ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు పేర్లు వినబడుతున్నాయి.