యూటర్న్’లో సీనియర్ హీరోయిన్!

కన్నడలో ఘన విజయం సాధించిన ‘యూటర్న్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు నటి సమంత. ఒరిజినల్ సినిమాను డైరెక్ట్ చేసిన పవన్ కుమార్ తెలుగు వెర్షన్ ను కూడా డైరెక్ట్ చేయనున్నారు. ఇటీవలే సినిమా షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఒకప్పటి తార భూమిక కూడా కనిపించబోతుందని సమాచారం. స్టార్ హీరోల సరసన నటించిన భూమిక కొన్నాళ్ళ పాటు సినిమాలకు దూరమయ్యారు.‘ఎంసిఏ’ చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఈ సినిమాలో భూమిక పాత్రకు మంచి పేరే దక్కింది. ప్రస్తుతం నాగచైతన్య నటిస్తోన్న ‘సవ్యసాచి’ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తోంది. తాజాగా సమంత సినిమాలో కూడా అవకాసం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.