యోగాతో జీవితంపై నియంత్రణ: మంచు లక్ష్మి

మొడ్రన్‌ లైఫ్‌ స్టెల్‌ లో యోగా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఒత్తిడితో నిండిన జీవన విధానం, బరువు తగ్గించుకోవడం..వంటి సమస్యలపై పోరాడేందుకు యోగా శక్తి వంతమైన ఆయుధంగా మారింది. అయితే యోగాలు అన్నీ ఒక్కటేనా..? అంటే కచ్చితంగా కాదు. శాస్ర్తీయమైన యోగా కేంద్రాలు అరుదుగా దొరుకుతాయి. యోగాను తమ జీవితంగా మార్చుకున్న ప్రొఫెషనల్‌ ట్రైనర్స్‌ కూడా కొంతమందే ఉంటారు. యోగాను పూర్తిగా అర్థం చేసుకొని దానిని ఫిజికల్‌ ప్లెక్సిబిలిటీ పెంచే సాధనంగా మాత్రమే కాకుండా మానసికమైన ఒత్తిడులను తగ్గించే మంత్రంగా మార్చడానికి శాస్ర్తీయ విధానాలు తెలిసిన వారికే సాధ్యం అవుతుంది. ఆ కోవకు చెందినదే హటమ్‌ స్టూడియో. ఇషా ఫౌండేషన్‌ నుంచి ట్రైనర్‌గా సర్టిఫై అయిన ఉషా మూర్తినేని.. నటి మంచు లక్ష్మికి యోగాలోశిక్షణ ఇస్తున్నారు.

ఉషా మూర్తినేని నిర్వహిస్తున్న హటమ్‌ స్టూడియోకు మంచులక్ష్మి అతిధిగా విచ్చేశారు. కొద్దిసేపు తను ఈ స్టూడియోలో యోగాను ప్రాక్టీస్‌ చేసి తన అనుభవాలను స్టూడెంట్స్‌ తో పంచుకున్నారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ “యోగా తన జీవితంలో భాగం అయినప్పటినుండి తన జీవితం పై పూర్తి నియంత్రణ వచ్చింది. రోజూ ఇన్ని పనులు మేనేజ్‌ చేయగలుగుతున్నానంటే దానికి కారణం యోగా మాత్రమే. ఎవరి జీవితంలోకి అయినా యోగాను అనుమతిస్తే వారి జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. ఉష అక్క యోగాను ప్రాక్టీస్‌ చేయించడం మొదలు పెట్టినప్పటినుండి యోగా పై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. ఉషా అక్క ఇచ్చిన శిక్షణలో యోగా అంటే శరీరం మనసు ఒకే ఆలోచనపై నిలవడం అనే విషయం అనుభవంలోకి వచ్చింది. యోగా అంటే అది మన సంస్కృతి, మన పెద్దలు మనకు ఇచ్చిన ఆస్తి. ఇలాంటి యోగా సెంటర్స్ అవసరం సొసైటికి చాలావుంది. హటమ్‌ స్టూడియో చాలా బాగుంది. మంచి సౌకర్యాలతో ఒక యోగా సెంటర్‌ని నిర్వహించడం చాల ఆనందంగా ఉంది” అన్నారు.

యోగా ట్రైనర్‌ ఉష మూర్తినేని మాట్లాడుతూ, “మంచు లక్ష్మి తన బిజీ షెడ్యూల్‌ లో కూడా యోగాను ప్రాక్టీస్‌ చేయడం మానరు. అది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. తను యోగాను ప్రాక్టీస్‌ చేసే తీరు చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఈరోజు స్టూడియోకు తను రావడం చాలా ఆనందంగా ఉంది. హటమ్‌ స్టూడియోలో యోగాను శాస్ర్తీయ పద్దతులలో నేర్పించడం జరుగుతుంది. వెయిట్‌ లాస్‌కి ప్రత్యేక శిక్షణతో పాటు రెగ్యులర్‌గా వచ్చే స్టూడెంట్స్‌కి ఇక్కడ శిక్షణ ఇవ్వటం జరుగుతుంది.” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here