‘రంగస్థలం’కు కత్తెర పోటు!

రామ్ చరణ్ ప్రధాన పాత్రలో సుకుమార్ ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చాలా కాలం పాటు నడిచింది. సుకుమార్ తన ప్రతిభతో సినిమాను చెక్కుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ సినిమా నిడివి విషయంలో కొన్ని అనుకోని సమస్యలు వచ్చినట్లు సమాచారం. వాస్తవానికి గత సంవత్సరం విడుదల అవుతుంది అనుకున్న ‘రంగస్థలం’ రకరకాల కారణాలతో వాయిదా పడి చిట్టచివరకు ఈ మార్చి 30న విడుదలకు సిద్ధం అవుతోంది.
అయితే ఇప్పటి వరకు ఈమూవీ  సెన్సార్ కు ఆన్ లైన్ లో అప్లయ్ చేయలేదు అని వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈమూవీ నిడివి రెండు గంటల నలభై నిమషాల వరకు వచ్చిందని తెలుస్తోంది. ఈమధ్య కాలంలో టాప్ హీరోల సినిమాలు అయినా పెద్దవిగా ఉంటే ప్రేక్షకులు అసహనం వ్యక్త పరుస్తున్న నేపద్యంలో ఈమూవీని రెండు గంటల 20 నిముషాలకు కుదించాలని సుకుమార్ ఆలోచిస్తూ ఉన్నా ఈమూవీలోని ఏ సీన్స్ కట్ చేయాలి అన్న అయోమయంలో ‘రంగస్థలం’ యూనిట్ ఉన్నట్లు టాక్.