‘రంగస్థలం’లో రాజకీయం!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ క్రేజీ డైరక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రంగస్థలం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. పల్లెటూరి ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ అవుతుండగా సినిమా నుండి వచ్చిన టీజర్ సినిమా మీద అంచనాలను పెంచేసింది. అయితే ఈ సినిమాలో ముఖ్యపాత్రలైన ప్రకాశ్ రాజ్, ఆది పినిశెట్టిలలో ఒకరి పాత్ర రివీల్ అయ్యింది. చిట్టిబాబు అన్నగా అది నటిస్తున్నాడు. కుమార్ బాబుగా ఆది లుక్ అతని రంగస్థలం గ్రామపంచాయితి ప్రెసిడెంట్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పోస్టర్ రివీల్ అయ్యింది. అప్పటికాలంలో పెద్ద కళ్లజోడుతో ఆది భలే ముచ్చటగా ఉన్నాడు. పాస్ పోర్ట్ ఫోటోనే అయినా ఆది ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడు అన్నది తెలిసిపోయింది. ఇక సినిమాలో విలన్ గా ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారని తెలిసిందే. గ్రామం నేపథ్యంలో రాజకీయ అంశాలను ఈ సినిమాలో ప్రస్థావించడం జరిగిందట. మరి అసలు రంగస్థలం కథ ఏంటో మార్చి 30న తెలుస్తుంది.