‘రంగస్థలం’ కాంబో రిపీట్!

‘రంగ‌స్థ‌లం’ ప్రేమ జంట రిపీట‌వుతోందా? అంటే అవున‌నే తాజా స‌మాచారం. ఆ మేర‌కు రామ్‌చ‌ర‌ణ్, స‌మంత జంట ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళిని ఓ రేంజులో ఇంప్రెస్ చేశారట‌. త్వ‌ర‌లో సెట్స్‌పైకి వెళ్ల‌నున్న ఎన్టీఆర్-చ‌ర‌ణ్‌-రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్‌లో చెర్రీ-సామ్ ఓ జంట‌గా ఫిక్స‌యిన‌ట్టేన‌ని, ఆ మేర‌కు జ‌క్క‌న్న ఎంతో ఆస‌క్తి క‌న‌బ‌రిచార‌ని చెప్పుకుంటున్నారు. ఇటీవ‌లే ‘రంగ‌స్థ‌లం’ ర‌ఫ్ విజువ‌ల్స్ చూసిన రాజ‌మౌళి ఈ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని తెలుస్తోంది.
చెర్రీ-సామ్ మ‌ధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. అందుకే ఆ జోడీని రిపీట్ చేస్తే అది త‌న సినిమాకి పెద్ద ప్ల‌స్ అవుతుంద‌ని భావిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఎన్టీఆర్ స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా క‌థానాయిక‌గా ఎంపికైంది. తెలుగు, త‌మిళ్‌, హిందీలో క్రేజీగా ఈ మ‌ల్టీస్టార‌ర్‌ని రిలీజ్ చేసే ఆలోచ‌న‌ ఉంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.