‘రంగస్థలం’ వాయిదా తప్పదా..?

ఏళ్ల తరబడి సినిమాలు చేసే పరిస్థితి లేదిప్పుడు. ‘బాహుబలి’ వంటి సినిమాలు మినహా మిగిలిన సినిమాలు ఏడాదిలోపే పూర్తి చేసేస్తున్నారు. అయితే రామ్ చరణ్ నటిస్తోన్న ‘రంగస్థలం’ సినిమా మాత్రం షూటింగ్ మొదలయ్యి ఇంతకాలం అవుతున్నా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. నిజానికి ఈ సినిమాను గతేడాది దసరాకి విడుదల చేయాలనుకున్నారు కానీ హడావిడి అవుతుందని సంక్రాంతికి వాయిదా వేశారు. ఆ సమయానికి పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ వస్తుండడంతో బాబాయ్ కి దారి ఇచ్చేసాడు చరణ్. ఇక మార్చి 30న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర్బృండం. కానీ ఇప్పుడు ఆ టైంకి వస్తుందా..? రాదా..? అనేది డౌట్. దానికి కారణం డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు(డీఎస్పీలు).
డీఎస్పీలు దిగొచ్చి నామమాత్రపు ధరకు ప్రొజెక్టర్లను అద్దెకిస్తే తప్ప సినిమా విడుదల కోసం రాజీపడకూడదని నిర్మాతలు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు లేకపోవడంతో నిర్మాతలు సమ్మెకు దిగారని మెల్లగా వాళ్ళే తగ్గుతారని భావిస్తున్నారు డీఎస్పీలు. నిర్మాతలు గనుక పట్టు వదలకపోతే ఇబ్బంది పడే మొదటి సినిమా ‘రంగస్థలం’. ఒకవేళ నిర్మాతలు రాజీ పడితే అది ఈ సినిమా కోసమేననే మాటలు వినిపిస్తాయి. మరి ఈ క్రమంలో ‘రంగస్థలం’ రిలీజ్ డేట్ మారుతుందేమో చూడాలి!