రజనీకాంత్ ‘కాలా’ చిత్రం రివ్యూ

Critics METER

Average Critics Rating: 3
Total Critics:3

AUDIENCE METER

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster
Release Date
June 7, 2018

Critic Reviews for The Boxtrolls

కబాలీ కంటే బెటర్‌ అనిపించిన కాలా
Rating: 2.5/5

https://www.klapboardpost.com

కాలా.. మధ్యలో దారి తప్పాడు
Rating: 2.5/5

http://www.tupaki.com

‘క‌బాలి’ 0.5
Rating: 2.75/5

https://www.telugu360.com

చిత్రం : ‘కాలా’
నటీనటులు : రజనీకాంత్‌, నానా పటేకర్‌, హూమా ఖురేషి, ఈశ్వరీరావు.
సంగీతం : సంతోష్ నారాయణన్‌
నిర్మాతలు : ధనుష్‌
దర్శకత్వం :పా.రంజిత్‌
విడుదల తేదీ : 07-06-2018
రేటింగ్ : 2.5/5

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమా వస్తోందంటే అభిమానులకు పండగే. అటు తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ రజనీకి మంచి క్రేజ్‌ ఉంది. అయితే రోబో తరువాత రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన సినామాలేవి ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ‘పా.రంజిత్‌’ దర్శకత్వంలో తెరకెక్కిన కబాలి సినిమాకు భారీ హైప్‌ క్రియేట్‌ చేయడంతో కలెక్షన్స్ వచ్చినా సినిమాకు మాత్రం పాజిటివ్‌ టాక్‌ రాలేదు. అయినా రజనీ మాత్రం మరోసారి పా.రంజిత్‌కే అవకాశం ఇచ్చారు. ముంబై మురికి వాడల నేపథ్యంలో రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన సినిమా ‘కాలా’. రజనీ ఏజ్‌కు, ఇమేజ్‌కు తగ్గ కథతో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..? రజనీ మ్యాజిక్‌ రిపీట్‌ అయ్యిందా..? కబాలితో నిరాశపరిచిన పా.రంజిత్‌ ..’కాలా’తో మెప్పించాడా..?

కథ : ఈ చిత్రంలో (రజనీకాంత్‌) పాత్ర ‘కరికాలా’ అలియాస్‌ ‘కాలా’ ముంబై మురికివాడ ధారావీకి పెద్ద దిక్కు. అక్కడే పుట్టి పెరిగిన ‘కాలా’ ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటుంటాడు. అయితే ముంబైలో అత్యంత విలువైన ఈ ప్రాంతాన్ని తమ హస్తగతం చేసుకునేందుకు రాజకీయనాయకులు ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా అధికార పార్టీ నాయకుడు (నానా పటేకర్‌) ‘హరిదేవ్‌ అభయంకర్‌’ అలియాస్‌ హరిదాదా ఎలాగైనా ధారావీ నుంచి ప్రజలను వెళ్లగొట్టి అక్కడ అపార్ట్‌మెంట్లు నిర్మించాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ కాలా హరిదాదా పనులకు అడ్డుతగులుతాడు. అలా హరిదాదా, కాలాల మధ్య మొదలైన యుద్ధం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది..? ఈ పోరాటంలో కాలా ఏం కోల్పోయాడు? చివరకు ధారావి ఏమైంది..? అన్నదే కథ.

నటీనటులు : రజనీకాంత్‌ తనదైన స్టైల్స్, మేనరిజమ్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు. యాక్షన్‌ సీన్స్‌ లో కాస్త ఇబ్బంది పడినట్టుగా అనిపిస్తుంది. పా.రంజిత్‌ రజనీకాంత్‌ను సరిగా ఉపయోగించుకోలేదేమోనన్న భావన కలుగుతుంది. సినిమా ప్రారంభమైన చాలా సేపటివరకూ రజనీకి సరైన డైలాగ్‌లు ఇవ్వలేదు. అయితే కథ నడుస్తున్న కొద్దీ, రజనీపాత్రను కొంచెం కొంచెం పెంచుకుంటూ పోయాడు. కాలా విశ్వరూపం అక్కడక్కడా కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తుంది. ఆ ఆవకాశం వచ్చినప్పుడల్లా రజనీ తన సత్తాను చూపించాడు. రజనీ తర్వాత అంత ప్రాధాన్యం ఉన్న పాత్ర విలన్‌ నానా పటేకర్‌ది. తెర మీద కనిపించేది కొద్ది సేపే అయినా ఉన్నంతలో సూపర్బ్‌ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. రజనీ ఇమేజ్‌ను ఢీ కొట్టే పొలిటీషియన్‌ పాత్రలో నానా పటేకర్‌ నటన సినిమాకు ప్లస్‌ అయ్యింది. రజనీ భార్యగా ఈశ్వరీరావు నవ్వించే ప్రయత్నం చేసింది. రజనీకాంత్‌, ఈశ్వరీ రావు మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. కీలక పాత్రలో నటించిన హూమా ఖురేషీ హుందాగా కనిపించింది. ఇతర పాత్రల్లో అంతా తమిళ నటులే కావడంతో తెలుగు ప్రేక్షకులు కనెక్ట్‌ కావటం కాస్త కష్టమే.

ఎలా ఉందంటే : “నేల మా హక్కు” అనే కాన్సెప్ట్‌ చూట్టూ సాగే కథ ఇది. భూమి ప్రాధాన్యం, భూమిని లాక్కోవడానికి పెత్తందారులు చేసే కుట్రలు, కుతంత్రాలను టైటిల్స్‌లోనే చెప్పి, ఈ కథా గమనం ఎలా సాగబోతోందో ముందే క్లూ ఇచ్చేశాడు దర్శకుడు. ధారావి మురికివాడలోని ప్రజల కష్టాలు, ఆ మట్టిపై వాళ్లకున్న మమకారం వాటికోసం జరిగే పోరాటం తెరపైకి తీసుకురాగలిగాడు దర్శకుడు. రజనీకాంత్‌ నుంచి కోరుకునే హీరోయిజం, రొమాంటిక్‌ సన్నివేశాలు, డైలాగ్‌లు దాంతో పాటు ఓ సామాజిక సమస్య.. వీటన్నింటినీ వరుస క్రమంలో పేర్చుకుంటూ సన్నివేశాలను రాసుకున్నాడు. కాలా-చిట్టెమ్మ (హుమా ఖురేషి)ల మధ్య లవ్‌ట్రాక్‌ కథకు దూరంగా సాగినా, రజనీతో రెండు మూడు సన్నివేశాలు ఉండుంటే కాలా కచ్చితంగా అభిమానులను మరింత మురిపించేది. కానీ, రజనీ హీరోయిజానికి, ఆయన నుంచి ప్రేక్షకులు కోరుకునే అంశాలకు ఈ
కథ-కథనం కాస్త దూరంగా సాగాయి. కథనంలో వేగం లేకపోవడం లోపంగా కనిపిస్తుంది. నానా పటేకర్‌లాంటి నటుడు ఉన్నప్పుడు ఈ పాత్రను దర్శకుడు ఇంకా బాగా ఉపయోగించుకోవాల్సింది. రజనీ-నానాపాటేకర్‌ల మధ్య సాగే సన్నివేశాలు రెండు, మూడు ఉంటాయంతే, కానీ వాటిని తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటుంది.

రెండో భాగం మొత్తం ధారావి చుట్టూనే తిరుగుతుంది. ఎమోషన్స్‌ పండించే ఆస్కారం ఉన్నా, అలాంటి సన్నివేశాలను దర్శకుడు రాసుకున్నా, వాటిని అంత ప్రతిభావంతంగా తెరకెక్కించలేకపోయాడు. చాలాసార్లు రజనీ తాలూకు హీరోయిజం కనిపించదు. అది అభిమానులను కాస్త నిరాశ పరుస్తుంది. ఏ పాత్రా తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండదు. పోరాట సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానంలో మాత్రం దర్శకుడు, సాంకేతిక నిపుణుల ప్రతిభ కనపడుతుంది. రజనీలాంటి కథానాయకుడు ఉన్నప్పుడు బలమైన కథ, కథనాలు ఉండాలి. అవి ఓ మాదిరిగా ఉన్నా, రజనీ తన హీరోయిజంతో లాక్కొచ్చేయగలడు. కానీ, రజనీని మాత్రమే నమ్ముకొని కబాలిని తెరకెక్కించాడు పా.రంజిత్‌. మరోసారి అదే తప్పును చేసినట్లు అనిపిస్తుంది. రజనీకాంత్‌ తప్ప మరో ఆకట్టుకునే అంశం ఏదీ లేకపోవడం కాలాకు శాపంగా మారింది.

ప్లస్‌ పాయింట్‌:
రజనీకాంత్‌
ఇంటర్వెల్‌ సీన్‌

మైనస్‌ పాయింట్స్‌ :
స్లో నేరేషన్‌
ఎడిటింగ్‌

కబాలీ కంటే బెటర్‌ అనిపించిన కాలా
(గమనిక: ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here