రజనీని ఫాలో అవుతున్న రామ్‌చరణ్

మెగా హీరో రామ్ చరణ్, ఉపాసనలు ఎక్కువగా నిజామాబాద్ లోని దోమకొండ సంస్థానంలో ఉన్న దేవాలయానికి వెళ్లి పూజలు చేయించి వస్తుంటారు. ఇటీవలే రామ్‌ చరణ్ దోమకొండలోని ఓ దేవాలయంలో పూజలు జరిపించారు. ఆ సమయంలో తెల్ల పంచె, చొక్కాతో ఒక సామాన్య వ్యక్తిగా ఆ గుడిలో పూజారులతో కలిసి ఫోటోలు కూడా దిగారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎంత పెద్ద స్టార్‌ అయినప్పటికీ దేవుడు ముందు అందరూ సమానమే అనే విధంగా ఉన్నాయి ఈ ఫొటోలు.

సూపర్ స్టార్ రజనీకాంత్ మార్గంలోనే రామ్ చరణ్ కూడా పయనిస్తున్నాడనిపిస్తోంది. ఎందుకంటే రజనీ కాంత్ సినిమా పూర్తి చేసిన తరువాత హిమాలయాలకు వెళ్లి అక్కడి సాధువులతో కొన్ని రోజులు గడిపి వస్తాడు. సినిమాల్లో తప్ప బయట రజినీకాంత్ చాలా సింపుల్ గా ఉంటాడు. రామ్‌ చరణ్ కూడా అలాగే నిజామాబాద్‌ దోమకొండ సంస్థానంలోని దేవస్థానానికి వెళ్లి పూజలు చేయించి వస్తుంటారు.