‘రణ్‌వీర్‌’ నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి

గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న స్టార్ హీరోయిన్‌ ‘సొనాలి బింద్రే’ తన ఆరోగ్యానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఎప్పటికపుడు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. చికిత్సలో భాగంగా జుట్టు కత్తిరించుకున్న సమయంలో భావోద్వేగానికి గురైన సొనాలి.. తన కొడుకు రణ్‌వీర్‌, ఇతర కుటుంబ సభ్యులు ఇచ్చిన ధైర్యంతో క్యాన్సర్‌ మహమ్మారితో పోరాడుతున్నానని పేర్కొన్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ‘సృష్టి ఆర్య’ సొనాలి ఆడపడుచు మీడియాతో మాట్లాడుతూ.. ‘సొనాలి చాలా ధైర్యంగా ఉన్నారు. త్వరలోనే ఆమె పూర్తిగా కోలుకుంటారంటూ’ తెలిపారు. ఈ మాటలు నిజం కావాలి అంటూ సొనాలి భర్త గోల్డీ బేల్‌.. రణ్‌వీర్‌ నవ్వుతూ ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ ఫొటోను చూసిన సొనాలి బింద్రే అభిమానులు.. రణ్‌వీర్‌.. నువ్వు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలని, మీ అమ్మకు ఆ దేవుడి దీవెనలు కూడా ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయని బెస్ట్‌ విషెస్‌ చెబుతున్నారు.
కాగా సొనాలి ప్రస్తుతం న్యూయార్క్‌లో క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నారు.