రవితేజ రీమేక్‌ ఆగిపోయిందా!

టాలీవుడ్‌ మాస్‌ మహారాజ రవితేజ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్‌ అక్బర్ ఆంటోని సినిమాలో నటిస్తున్నాడు. రవితేజ వరుసగా టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు సినిమాలు ప్లాప్‌ కావటంతో ఈ సీనియర్‌ హీరో ఆలోచనలో పడ్డాడు. శ్రీనువైట్ల గత చిత్రాలన్ని నిరాశపరచటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలేమి లేవు అనే చెప్పాలి.

ఈ నేపథ్యంలో మరో వార్త మాజ్‌ రవితేజ అభిమానులకు షాక్‌ ఇస్తుంది. అమర్‌ అక‍్బర్ ఆంటోని తరువాత రవితేజ, సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటించేందుకు ఓకె చెప్పాడు. విజయ్‌ హీరోగా తమిళ్‌లో సూపర్ హిట్ అయిన తేరి సినిమా తెలుగు రీమేక్‌లో నటించేందుకు ఓకె చెప్పాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ రీమేక్‌ను పూర్తిగా పక్కన పెట్టిసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై చిత్రయూనిట్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెల్లడించలేదు.