రవితేజ సినిమా నుంచి తప్పుకున్న అను

శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం గురించి తెలిసిందే. అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఒకరు అను ఇమ్మాన్యుయేల్ కాగా మరో హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటిస్తోంది. తాజా సమాచారం ఏంటంటే ఈ సినిమా నుంచి అను తప్పుకుందని సమాచారం. కొద్దిరోజుల క్రితం ఈ చిత్రం అమెరికాలోని అందమైన లొకేషన్స్ లో మొదటి షెడ్యూల్ జరుపుకుంది.

ప్రస్తుతం చైతూ పక్కన శైలజారెడ్డి సినిమాలో అను చేస్తోంది. డేట్స్ కుదరక పోవడంతోనే రవితేజ మూవీ నుంచి తప్పుకున్నట్లు
తెలిసింది. అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రానికి సంబంధించి 90 శాతం షూటింగ్ అమెరికాలోనే జరిపే అవకాశముంది. అమెరికా
షెడ్యూల్ కోసమే ఎక్కువ రోజులు డేట్స్ అవసరం కావడంతో కుదరక అను తప్పుకున్నట్లు తెలిసింది. నిర్మాతలు మైత్రీ మూవీ
మేకర్స్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని సెప్టెంబర్లో విడుదల చేసేందుకు
సన్నాహాలు చేస్తున్నారు.