రవిశాస్త్రితో డేటింగ్ పై స్పందించిన నిమ్రత్‌ కౌర్‌

బాలీవుడ్‌ నటి నిమ్రత్‌ కౌర్‌ టీమిండియా కోచ్‌ రవిశాస్త్రితో ప్రేమలో ఉన్నట్టు వచ్చిన వదంతులపై స్పందించింది. తమ ఇద్దరి మధ్యన ఎలాంటి సంబంధం లేదని స్పష్టతనిచ్చింది.  ఈ మేరకు నిమ్రత్‌ కౌర్‌ ఓ ట్వీట్‌ చేసింది.

‘వాస్తవం: నాకో రూట్‌ కెనాల్‌ కావాలేమో.
కాల్పనికం: నా గురించి నేను ఈ రోజు చదివింది అంతా
మరిన్ని నిజాలు: అవాస్తవాలు చాలా బాధిస్తాయి. మండే బ్లూస్‌ ఉన్నాయి, నాకు ఐస్‌క్రీం ఇష్టం’ అని నిమ్రత్‌ ట్వీటింది.

హిందీలో ‘ఎయిర్‌లిఫ్ట్‌’, ‘ది లంచ్‌ బాక్స్‌’లాంటి సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించిన నిమ్రత్‌ రెండేళ్లుగా రవిశాస్త్రితో ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్‌ వర్గాలు గుసగుసలాడుకుంటున్నట్టు
వార్తలు వచ్చాయి.