‘రష్మీ నువ్వు సుధీర్‌ను పెళ్లి చేసుకో?’

జబర్ధస్త్‌ కామోడీ షో తో ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్‌ రేష్మీ. బుల్లితెరపై వివిధ షోలతో తరచు సందడి చేస్తుంటారు యాంకర్ రష్మి, సుధీర్‌. తెరపై వీరి కెమిస్ట్రీ చక్కగా ఉంటుంది కాబట్టి.. ప్రేక్షకులు కూడా ఈ జంటను ఎక్కువ ఇష్టపడుతుంటారు. వినోదం పంచడానికి రష్మి, సుధీర్‌ కూడా ప్రేమికులుగా నటిస్తుంటారు. దీంతో వీరు నిజంగానే ప్రేమలో ఉన్నారా? అనే అనుమానం నెటిజన్లలో కలిగింది.

ఈ నేపథ్యంలో ట్విట్టర్‌ లో ఓ అభిమాని ‘రష్మి.. సుధీర్‌ను పెళ్లి చేసుకో. మీరిద్దరు ఒకరి కోసం మరొకరు పుట్టినట్లు ఉంటారు. ఇద్దరు కెరీర్‌ కోసం చాలా కష్టపడుతున్నారు’ అని ఉచిత సలహా ఇచ్చాడు. దీనికి రష్మి ప్రతి స్పందించారు. నిజ జీవితం, తెరపై జీవితం వేరని.. ఈ విషయాన్ని గ్రహించాలని అన్నారు.

‘మమ్మల్ని తెరపై చూసి.. మేమిద్దరం ఒకరి కోసం మరొకరం పుట్టామని ఎలా అనుకుంటారు. రియల్ లైఫ్ నుంచి రీల్‌ లైఫ్‌ను వేరు చేయడం నేర్చుకోండి. మేం తెరపై చేసేదంతా ప్రేక్షకులకు వినోదం పంచడం కోసం మాత్రమే. మేం ఎవర్ని పెళ్లి చేసుకోవాలి అనేది మా నిర్ణయం, సలహాలు అవసరం లేదు’ అని రష్మి ఘాటుగా సమాధానం ఇచ్చారు.