రాఘవ లారెన్స్‌ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి

క్యాస్టింగ్‌ కౌచ్‌పై సంచలనం సృష్టంచిన నటి శ్రీరెడ్డి సినీ ప్రముఖులపై సోషల్‌ మీడియాలో విమర్శలు చేస్తూ వార్తో నిలుస్తున్నారు. నిన్నమోన్నటి వరకు టాలీవుడ్‌లో పలువురు ప్రముఖుల పై సంచల వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి ఇప్పడు తాజాగా కోలివుడ్‌ ఇండస్ర్టీలో ప్రముఖులపై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటే స్టార్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ మురుగదాస్‌ పై ఆరోపణలు చేయగా. తాజాగా తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రఫర్‌, హీరో రాఘవ లారెన్స్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘ఓ రోజు నేను నా స్నేహితుల ద్వారా లారెన్స్‌ మాస్టర్‌ని హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌ గోల్కొండ హోటలో కలుసుకున్నాను. ఆ సమయంలో లారెన్స్ తనని తన రూమ్‌కి పిలిపించారు. అక్కడికి వెళ్లాకా రాఘవేంద్ర స్వామి ఫోటో, రుద్రాక్షలు చూసి నాకు చాలా అద్భుతం అనిపించింది. అనంతరం నెమ్మదిగా లారెన్స్ నాతో మాట్లాడడం మొదలు పెట్టారు. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చి.. కొత్తగా ఇక్కడికి వచ్చే చాలా మందికి, పేద పిల్లలకి సహాయం అందిస్తున్నానన్నారు. నాకు అది చాలా మంచిగా అనిపించింది. అ తరువాత లారెన్స్‌ తన నిజస్వరూపం చూపించారు. నా నడుముతో పాటు ఇతర శరీర భాగాలు చూపించమన్నాడు. నాతో అసభ్యంగా డ్యాన్స్ మూమెంట్స్ కూడా చేశాడు. అనతరం లారెన్స్ తనకు అవకాశం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. దీంతో లారెన్స్‌తో కొంత కాలం పాటు స్నేహంగా ఉన్నాన్నాను. ఇందులో బెల్లంకొండ సురేష్ చివరికి విలన్ అయ్యారన్నారని’ శ్రీ రెడ్డి తెల్పింది.