రాజకీయాలపై వినాయక్ కామెంట్!

ప్రముఖ మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ రాజకీయాల్లో చేరే అవకాశాలున్నాయా అనే విషయంపై టాలీవుడ్ లో చర్చలు సాగుతున్నాయి. తాజగా ఈ విషయంపై స్పందించారు వినాయక్. ‘రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా..?’ అనే ప్రశ్నకు సమాధానంగా ఆయన ‘నేను దర్శకుడిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు.. కానీ అయ్యాను. రాజకీయాలపై కూడా నాకు దృష్టి లేదు. దేవుడు ఎలా నడిపిస్తాడో చూడాలి. అంతా విధిరాత’ అంటూ చెప్పుకొచ్చాడు.

వినాయక్ కు రాజకీయ నేపధ్యం ఉండడంతో ఆయన కూడా రాజకీయాల్లోకి వస్తారని అనుకున్నారు. కానీ ప్రస్తుతానికి అటువంటి ఆలోచన లేదని భవిష్యత్తులో చెప్పలేనని అన్నారు. ప్రస్తుతం వినాయక్ రూపొందించిన ‘ఇంటెలిజెంట్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఓ మేరకు అంచనాలు ఏర్పడ్డాయి.