రాజమౌళి ఆవిడను ఏమని పిలిచారు?

తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని విశ్వమంతా చాటిచెప్పి ప్రతిష్ఠాత్మకంగా నిలిచిన “బాహుబలి” చిత్రాన్ని అంత అందంగా మలిచిన జక్కన్న రాజమౌళి ఎన్ని అవార్డులు అందుకున్నారో తెలిసిందే. ఆ సినిమా కోసం రాజమౌళి ఎంత కష్ట పడ్డారో ఆయన సతీమణి రమా కూడా ఆయన వెన్నంటి ఉండి అంతే సహాయపడ్డారు. ఇటీవల బిహైండ్‌వుడ్స్‌ గోల్డ్‌ మెడల్‌ అవార్డుల్లో రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా బంగారు పతకం అందుకున్నారు. ఈ అవార్డుల కార్యక్రమంలో రాజమౌళికి సంబంధించిన ఓ వీడియోను బిహైండ్‌వుడ్స్ సంస్థ విడుదల చేసింది. అందులో రాజమౌళి అవార్డు అందుకుంటున్న సమయంలో ఆయన సతీమణిని ఆహ్వానిస్తూ స్టేజ్ పైకి రావాల్సిందిగా హోస్ట్ కోరారు. అయితే తమిళ భాషలో ఆహ్వానం చెప్పడంతో రాజమౌళి సతీమణికి అర్ధం కాలేదు.

బాహుబలి సినిమాకు గానూ రాజమౌళి ఎన్ని అవార్డులు అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల బిహైండ్‌వుడ్స్‌ గోల్డ్‌ మెడల్‌ అవార్డుల్లో రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా బంగారు పతాకం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజమౌళికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియోను బిహైండ్‌వుడ్స్‌ సంస్థ తాజాగా విడుదల చేసింది. అదేంటంటే.. రాజమౌళి మెడల్‌ అందుకుంటున్న సందర్భంగా కార్యక్రమాన్ని హోస్ట్‌ చేస్తున్న వ్యాఖ్యాతలు రమాను కూడా స్టేజ్‌పైకి ఆహ్వానించారు. ఆ సమయంలో వెంటనే రాజమౌళి మైక్‌ అందుకుని “చిన్నీ.. స్టేజ్‌పైకి రమ్మంటున్నారు” అని ప్రేమగా పిలిచారు. అప్పుడు రమ లేచి స్టేజ్‌పైకి వెళుతుండగా అక్కడే ఉన్న అనుష్క.. రమా, రాజమౌళిల ఫొటోలు తీశారు. ఈ అపురూపమైన దృశ్యాన్ని బిహైండ్‌వుడ్స్‌ విడుదల చేసినందుకు “జక్కన్న” అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.