రాజమౌళిని ఆకట్టుకున్న ఆమె!

“ఈ నగరానికి ఏమైంది” “సమ్మోహనం” సినిమాల నుద్దేశించి చిత్ర బృందాలకు ఎస్‌.ఎస్‌. రాజమౌళి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేశారు. మంచి సినిమాలను ప్రోత్సహించడంలో రాజమౌళి ఎప్పుడూ ముందుంటారు. ఆ రెండు సినిమాలపై ప్రశంసల జల్లు కురిపించారు. నవ్వులతో కూడుకున్న ఎంతో ప్రశాంతమైన సినిమా అని.. తరుణ్‌ భాస్కర్‌ తన సత్తాను మరోసారి నిరూపించారని “ఈ నగరానికి ఏమైంది” చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు. నూతన నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం మంచి టాక్ సంపాదించింది. పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

తర్వాత ఇటీవల విడుదలైన సుధీర్‌బాబు చిత్రం “సమ్మోహనం” గురించి కూడా ప్రస్తావించారు. ఈ సినిమాను కాస్త ఆలస్యంగా చూశానని అందులో అదితిరావు హైదరి నటన ఎంతో బాగుందని, తన నటన చూసి బాగా ఇంప్రెస్ అయ్యానని అన్నారు. సుధీర్‌బాబు కూడా చక్కగా చేశారని, సీనియర్ నటుడు నరేశ్‌ పాత్ర వినోదభరితంగా ఉందని చిత్ర బృందానికి నా అభినందనలు అని రాజమౌళి తన ట్వీట్ ద్వారా తెలిపారు.