రాజమౌళి కొడుకు ఎంట్రీ ఈ హీరోతోనేనా..?

రాజమౌళి కొడుకు ఎంట్రీ ఈ హీరోతోనేనా..?
తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం బాహుబలి2 సినిమా 
పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. రాజమౌళి వారసత్వం కింద గత కొన్ని రోజులుగా ఆయన కుమారుడు కార్తికేయ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి. కార్తికేయ, రాజమౌళి చేసే ప్రతి సినిమాలో ఇన్వాల్వ్ అవుతుంటాడు. తండ్రి దగ్గరే పనితనం నేర్చుకుంటున్న ఈ కుర్రాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడనేది ఫిల్మ్ నగర్ టాక్. దీనికోసం సింహాద్రి, యమదొంగ సినిమాల సీక్వెల్స్ ను సిద్ధం చేస్తున్నారట. ఆ రెండిటిలో ఏదొక సినిమాను కార్తికేయ డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని అర్క, సాయి కొర్రపాటిలు సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమా గనుక ఓకే అయితే 2017లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. 
CLICK HERE!! For the aha Latest Updates