రాజమౌళి మల్టీస్టారర్‌ చిత్రంలో జాన్వీ కపూర్..!

దర్శకధీరుడు రాజమౌళి పేరు బాహుబలి తరువాత మారుమ్రోగిపోయింది. బాహుబలి-1, 2లు మంచి విజయం సాధించాయి. ఏ తెలుగు సినిమా సాధించలేని రికార్డులను బాహుబలి అందుకుంది. బాహుబలిలో శివగామి పాత్రకు ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ పాత్రకోసం మొదట శ్రీదేవిని అనుకున్నారట, శ్రీ దేవిని సంప్రదిస్తే.. రెమ్యునరేషన్‌ భారీ స్థాయిలో డిమాండ్ చేయడంతో..ఈ పాత్రలో రమ్యకృష్ణ ను తీసుకున్నారు. ఈ పాత్ర ద్వారా రమ్యకృష్ణకు ఎంతటి పేరు వచ్చిందో చెప్పక్కరలేదు.

ప్రస్తుతం రామ్‌ చరణ్‌-ఎన్టీఆర్‌లతో రాజమౌళి ఓ మల్టీస్టారర్‌ చిత్రాన్ని తీస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ హీరోయిన్‌గా ఇప్పటికే మహనటి ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్‌ను కన్ఫర్మ్‌ చేశారు. రెండో హీరోయిన్‌గా సమంతను సంప్రదిస్తే.. ఆమె సున్నితంగా తిరస్కరించినట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో వార్త సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తోంది. ధడక్‌ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌.. రాజమౌళి మల్టీస్టారర్‌ సినిమాలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌.. జాన్వీని రికమండ్‌ చేస్తున్నట్టుగా బాలీవుడ్‌ టాక్‌.

ధడక్‌ సినిమా తరువాత జాన్వీకి కరణ్‌ జోహార్‌ గాడ్‌ఫాదర్‌గా వ్యవహరిస్తున్నారు. జాన్వీకి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు రావాలి అంటే.. రాజమౌళి సినిమాతోనే సాధ్యం అవుతుందని భావిస్తున్నాడు కరణ్ జోహార్. బాహుబలి రెండు సినిమాలను బాలీవుడ్‌లో కరణ్‌ జోహార్‌ సంస్థే ప్రమోట్‌ చేసింది. ఈ చనువుతోనే కరణ్‌.. రాజమౌళిని అడిగినట్టుగా తెలుస్తుంది. రాజమౌళి సినిమా కోసం జాన్వీ 100 కాల్షీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు ఫిలిం నగర్‌ టాక్‌. ఇందులో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.