రాజ్‌ తరుణ్‌ ‘లవర్‌’కు యూ/ఏ సర్టిఫికెట్‌

యువ నటుడు రాజ్‌ తరుణ్‌, రిధి కుమార్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘లవర్’. అనీష్‌ కృష్ణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో భారీ యాక్షన్‌ సన్నివేశాలతో రాజ్‌తరుణ్‌ కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దిల్‌ రాజు నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని నిర్మాణాంతర పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా సెన్సార్‌ బోర్డ్‌ యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. ఈ మూవీ జూలై 20వ తేదీన ప్రక్షకుల ముందుకు రానుంది.