రాథోడ్ దర్శకత్వంలో ‘రామసక్కనోడు’ ప్రారంభం…!

రాథోడ్ దర్శకత్వంలో  ‘రామసక్కనోడు’ ప్రారంభం…!
 
ఎం రాథోడ్ దర్శకత్వంలో ఎం.మణీంద్రన్ నిర్మాతగా అమ్మ నాన్న ఫిలిమ్స్ పతాకంపై ‘రామసక్కనోడు’ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైన ఈ చిత్రానికి దర్శక రత్న, దాసరి నారాయణ రావు క్లాప్ కొట్టగా, రాజ్ కందుకూరి ఫస్ట్ షాట్ కి దర్శకత్వం వహించాడు. కాగా సీనియర్ పాత్రికేయులు వినాయకరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. 
 
రామసక్కనోడు చిత్రానికి కథ మాటలు- శ్రీనాథ్ రెడ్డి, సంగీతం డి.జె వసంత్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీగా బి.వి అమర్ నాథ్ రెడ్డి, కో డైరెక్టర్ గా శ్రీకాంత్ వ్యవహరిస్తున్నారు. చిత్రానికి నటీనటులుగా రాహుల్ రవి చంద్రన్, నిత్యశెట్టి, తరుణిక, కార్తిక్ ఆనంద్, సత్యం రాజేష్, ఎల్.బి. శ్రీరామ్, సారిక రామచంద్రరావ్, తోటపల్లి మథు, జెమిని రాఘవ ఆయా పాత్రలను పోషిస్తున్నారు.