‘రానా’ను ఆహ్వానించలేదట!

తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’. ఈ చిత్రంలో నూతన నటీనటులు విశ్వక్సేన్‌ నాయుడు, సుశాంత్‌రెడ్డి, అభినవ్‌‌ గోమతం, వెంకటేష్‌ కాకుమాను, అనిషా ఆంబ్రోస్‌, సిమ్రాన్‌ చౌదరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్‌ లభించింది. ఈ సందర్భంగా యూనిట్‌ సభ్యులంతా తమ ఆనందాన్ని పంచుకుంటూ ఓ హోటల్‌లో విందు ఏర్పాటు చేసుకున్నారు. సురేశ్‌బాబు, తరుణ్‌.. ఇలా దాదాపు 20 మందికి పైగా కలిసి భోజనం చేశారు.

ఈ సందర్భంగా తీసిన ఫొటోను రానా ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ ఆ విందుకు ‘నన్నెందుకు పిలవలేదు?’.. ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ ‘సురేశ్‌ ప్రొడక్షన్స్‌’ను ట్యాగ్‌ జత చేశారు. “ఈ నగరానికి ఏమైంది” చిత్రాన్ని రానా తండ్రి మరియు ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు నిర్మించారు. ఈ చిత్రానికి వివేక్‌ సాగర్‌ బాణీలు అందించారు.