రానా షాకింగ్ రెమ్యునరేషన్!

బాహుబలి చిత్రంతో నేషనల్ స్టార్ గా మారిపోయాడు రానా. తన ఇమేజ్ ను పెంచే విధంగా ఉండే పాత్రలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ తమిళ భాషల సినిమా రంగాలలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. అసలు విషయంలోకి వస్తే.. ‘బిగ్ బాస్’ సీజన్ 2 కార్యక్రమాన్ని జూనియర్ చేత మళ్ళీ నిర్వహించాలని స్టార్ మా యాజమాన్యం భావించినా జూనియర్ కు త్రివిక్రమ్ మూవీతో ఆతరువాత రాజమౌళి ప్రాజెక్ట్ తో ఏర్పడ్డ బిజీ వల్ల ‘బిగ్ బాస్’ సీజన్ 2కు సున్నితంగా తిరస్కరించిన విషయం తెలిసిందే.
దీంతో యాజమాన్యం దృష్టి అల్లు అర్జున్, రానాలపై పడింది. ఇప్పటికే బుల్లితెరపై పలు షోలను హోస్ట్ చేసిన అనుభవం ఉన్న రానా అయితే ఈ షోకి యాప్ట్ అని భావించి ఆయనను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే రానా ఈ షోను హోస్ట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ గతంలో తీసుకున్న పారితోషికం కంటే ఎక్కువ డిమాండ్ చేయడం స్టార్ మా యాజమాన్యానికి షాక్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో నిర్వాహకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!