రాబోయేది ఇందిరమ్మ రాజ్యం: కోట్ల

ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో బుధవారం కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్‌ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ..ప్రజలను రక్షించే వారు మాత్రమే పాలకులు అవుతారు.. భక్షించే వాళ్లు కాదని అన్నారు. దేశంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో చంద్రబాబును సాగనంపే రోజులు దగ్గర పడ్డాయని మండిపడ్డారు. అందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కోట్ల సూర్య ప్రకాశ్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

దేశంలో, రాష్ట్రంలో రోజు రోజుకూ మహిళలపై దాడులు పెరిగిపోతున్నా పాలకులు నోరు విప్పడం లేదని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో రాహుల్‌ను ప్రధాని చేసి ఇందిరమ్మ రాజ్యం-ఇంటింటా సౌభాగ్యం అనే పాలన మరోసారి తెచ్చుకుందామని అన్నారు. ఈ నెల 18న కర్నూలులో రాహుల్‌ పర్యటనతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని తెలిపారు.