రామోజీరావుతో బాలయ్య మీటింగ్!

దర్శకుడు తేజ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఎన్టీఆర్‌ చిత్రంలో సీనియర్‌ హీరో బాలకృష్ణ లీడ్‌ రోల్‌ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 29న చిత్రాన్ని లాంఛ్‌ చేయనున్నట్లు ఆయన మీడియాతో ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ తో ఎన్నో సన్నిహితంగా మెలిగిన రామోజీరావు పాత్ర ఎవరు వేస్తారు..అసలు ఆ పాత్రను ఎలా చూపించనున్నారు అనే విషయమై ఇప్పటికే తర్జన బర్జనలు మొదలయ్యాయి. ఈ విషమయై బాలకృష్ణ స్వయంగా రామోజీరావుతో మాట్లాడి ఫైనల్ చేస్తారని సమాచారం.
ఈ నేపథ్యంలో నేడు కృష్ణా జిల్లా పామర్రు మండలం కోమరవోలు, ఎన్టీఆర్‌ స్వస్థలం నిమ్మకూరు గ్రామాలలో త్వరలో బాలకృష్ణ పర్యటించారు. చిత్ర ముహూర్తానికి రావాలని ఆయా గ్రామల్లో ఉన్న తమ బంధువులను ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలయ్య.. ఎన్టీఆర్‌ తనయుడిగా ఆయన జీవిత చరిత్ర నటించటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ రామకృష్ణ సినీ స్టూడియోలో తొలిషెడ్యూల్‌ షూటింగ్‌ జరగనున్నట్లు తెలియజేశారు. ఎన్టీఆర్‌ వాస్తవ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోయే చిత్రమని, ఎన్నికల సందర్భంగా తీసే సినిమా కాదని బాలయ్య స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. సినిమా షూటింగ్‌ను వేగవంతంగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.