రామ్‌ చరణ్, ఉపాసన కసరత్తు

ప్రముఖ నటుడు రామ్‌ చరణ్ కూడా తన భార్య ఉపాసనతో కలిసి జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. ఉపాసన ఏడు రోజుల ట్రాన్స్‌ఫార్మేషన్‌ ఛాలెంజ్‌ను తనకుతానుగా స్వీకరించారు. ఉపాసనకు ప్రేరణగా ఉండటానికి చెర్రీ కూడా జిమ్‌లో ఆమెతోపాటు కసరత్తులు చేస్తున్నారట. ఈ విషయాన్ని ఉపాసన స్వయంగా చెప్పారు. ట్రైనర్‌ తమతో ఇవాళ చాలా కఠినమైన వ్యాయామం చేయించినట్లు పేర్కొన్నారు. ‘ఎస్‌.. నేను గెలిచా. మిస్టర్‌ సి (చరణ్‌) చాలా స్వీట్‌.. నాకు ప్రేరణగా ఉండటానికి ఆయన కూడా ఏడు రోజుల ట్రాన్స్‌ఫార్మేషన్‌లో నాతోపాటు చేరారు’. అని ఉపాసన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఉపాసన సోషల్‌మీడియాలో చాలా చురుకుగా ఉంటుంటారు. తన భర్త, కుటుంబ సభ్యుల విశేషాలను పోస్ట్‌ చేస్తుంటారు.

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఫ్యామిలీ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు చరణ్‌. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి కాగా, త్వరలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి ఓ భారీ మల్టీస్టారర్ సినిమా లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.